80ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ విధానం
ABN , First Publish Date - 2020-11-25T20:39:51+05:30 IST
జీహెచ్‌ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కాగా కోవిడ్-10 విజృంభిస్తున్న నేపధ్యంలో ఈసారి బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా వృద్దులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం కాస్తరిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. దీంతో 80 సంవత్సరాలు పై బడిన వారికి పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి ఆదేశించారు.
దీంతో జీహెచ్‌ఎంసి కమిషనర్, ఎన్నికల అధికారి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 80సంవత్సరాలు పైబడిన వారికే కాకుండా దివ్యాంగులు, కోవిడ్-19పాజిటివ్ ఉన్నవారంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పోస్టల్ మేనేజ్‌మెంట్‌మోడ్‌లో ఓటు ఎలా వేయాలన్న దాని కోసం అధికారి వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఒక వ్యక్తి ఒక ఓటు కోసం దరఖాస్తుచేసుకోవల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్‌ను పోస్ట్ ద్వారా ఇంటికే పంపుతారు.