గుట్కా, అంబర్‌ ప్యాకెటర్ల స్వాధీనం

ABN , First Publish Date - 2020-03-04T11:40:32+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.3 లక్ష ల విలువైన గుట్కా, అంబర్‌ ప్యాకెట్‌లను స్వాధీనం

గుట్కా, అంబర్‌ ప్యాకెటర్ల స్వాధీనం

ఇద్దరిపై కేసు నమోదు


మహబూబాబాద్‌ క్రైం, మార్చి 3: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.3 లక్ష ల విలువైన గుట్కా, అంబర్‌ ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌ పట్టణంలోని సూర్య టాకీస్‌ సమీపం్లఓ ఎస్సై మురళీధర్‌రాజు పెట్రోలింగ్‌ చేస్తుండగా అక్కడికి సమీపంలో రెండు కిరాణ షాపుల్లో గుట్కాలను నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది. దీంతో మాలే మధుసూదన్‌, పడిగల వెంకటేశ్వర్లు షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాలను  స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు గుట్కాల విలువ సుమారు రూ.3 లక్షల ఉంటుందని చెప్పారు. అక్రమంగా గుట్కాలను షాపుల్లో నిల్వ ఉంచి న మదుసూదన్‌, వెంకటేశ్వర్లుపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2020-03-04T11:40:32+05:30 IST