ఆర్టీసీ బస్సులో పాజిటివ్‌ వ్యక్తులు

ABN , First Publish Date - 2020-06-06T08:56:53+05:30 IST

కరోనా పాజిటివ్‌గా తేలి.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

ఆర్టీసీ బస్సులో పాజిటివ్‌ వ్యక్తులు

కింగ్‌కోఠి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స

హోం ఐసోలేషన్‌కు పంపించిన వైద్యులు

అంబులెన్స్‌ ఏర్పాటు చేయని ఆస్పత్రి వర్గాలు


 ఆర్మూర్‌, జూన్‌ 5: కరోనా పాజిటివ్‌గా తేలి.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.  నిజామాబాద్‌ జిల్లా చేగుంటకు చెందిన వీరు.. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. అయితే ఐసీఎంఆర్‌ వెలువరించిన నూతన నిబంధనల మేరకు వీరిని హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాల్సిందిగా సూచిస్తూ ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపిచాయి. కానీ, అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో వీరు గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆర్మూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఎక్కారు. చేగుంట వరకు ప్రయాణించారు. ఇంతలో సమాచారం అందుకున్న ఆస్పత్రి వర్గాలు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి.. ఇద్దరినీ అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. బస్సు డ్రైవర్‌ను, కండక్టర్‌ను 15 రోజుల వరకు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇదే బస్సులో మరో 15 మంది ప్రయాణికులు కూడా ప్రయాణించారు. 

Updated Date - 2020-06-06T08:56:53+05:30 IST