వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 95 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-12T10:35:51+05:30 IST

వరంగల్‌ అర్బన్‌లో మంగళవారం 95 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 95 మందికి పాజిటివ్‌

హన్మకొండ అర్బన్‌,  ఆగస్టు 11 :  వరంగల్‌ అర్బన్‌లో మంగళవారం 95  కరోనా కేసులు నమోదు అయినట్లు  వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. ఆది, సోమవారం  చేసిన పరీక్షల్లో గుర్తించిన కరోనా బాధితుల్లో ధీర్ఢకాలిక వ్యాధులు కలిగిఉన్నవారిని, ప్రాథమిక స్థాయిదాటిన వారిని ఎంజీఎం కోవిడ్‌ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు 17 రోజుల పాటు గృహనిర్భంధాన్ని పాటించాలని సూచించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ హోంక్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్యపరిస్థితి టెలికాలింగ్‌ ద్వారా తెలుసుకుంటున్నామని వారు వివరించారు. 

Updated Date - 2020-08-12T10:35:51+05:30 IST