జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల్లో 268 పాజిటివ్‌ కేసులు: ఈటల

ABN , First Publish Date - 2020-04-25T00:33:08+05:30 IST

జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల్లో 268 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోజుకు 50మందికిపైగా డిశ్చార్జ్‌ చేసే అవకాశముందని చెప్పారు.

జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల్లో 268 పాజిటివ్‌ కేసులు: ఈటల

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల్లో 268 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోజుకు 50మందికిపైగా డిశ్చార్జ్‌ చేసే అవకాశముందని చెప్పారు. కరోనా బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 983కి చేరాయన్నారు. తెలంగాణలో ఈరోజు 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. కరోనాతో ఇప్పటివరకు 25మంది మృతి చెందారని, 291మంది డిశ్చార్జ్‌ చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 663 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపారు.


‘‘గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాం. కరోనా బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. హైదరాబాద్, గద్వాల, సూర్యాపేట, వికారాబాద్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. వైద్యులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు. 10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్‌95 మాస్కుల కోసం ఆర్డరిచ్చాం. ఫ్లాస్మా థెరపీ కోసం దరఖాస్తు చేస్తే అనుమతి వచ్చింది’’ అని ఈటల రాజేందర్ తెలిపారు.


Updated Date - 2020-04-25T00:33:08+05:30 IST