పేద, మధ్య తరగతి పక్షపాతి మోదీ: సంజయ్‌

ABN , First Publish Date - 2020-03-27T09:51:18+05:30 IST

లాక్‌ డౌన్‌తో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి

పేద, మధ్య తరగతి పక్షపాతి మోదీ: సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌తో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షపాతి అని మోదీ మరోసారి నిరూపించుకున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణలోని 99శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సంజయ్‌ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఐదుగురు పేదలకు భోజనం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భారీ ప్యాకేజీ ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు చెబుతూ శుక్రవారం సాయంత్రం నమోజ్యోతి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న కష్టకాలంలో ప్రధాని మోదీ.. దేశ ప్రజలందరికీ అండగా నిలిచారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ కొనియాడారు.

Updated Date - 2020-03-27T09:51:18+05:30 IST