పూలే విగ్రహాన్ని కూల్చిన వారిని శిక్షించాలి: కృష్ణయ్య

ABN , First Publish Date - 2020-08-11T09:18:00+05:30 IST

పూలే విగ్రహాన్ని కూల్చిన వారిని శిక్షించాలి: కృష్ణయ్య

పూలే విగ్రహాన్ని కూల్చిన వారిని శిక్షించాలి: కృష్ణయ్య

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ నగరంలోని దర్గా కూడలిలో మహాత్మా పూలే విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ నెల 8న విగ్రహాన్ని కూల్చివేస్తే  పోలీసులు ఇప్పటివరకు బాధ్యులను గుర్తించలేదని విమర్శించారు.  పూలే గొప్ప సంఘ సంస్కర్తని, బడుగుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. 

Updated Date - 2020-08-11T09:18:00+05:30 IST