కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

ABN , First Publish Date - 2020-12-14T04:30:56+05:30 IST

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం
శ్రీమెట్టురామలింగేశ్వరస్వామి క్షేత్రంలో శివపార్వతుల కల్యాణం

మడికొండ, డిసెంబరు 13: మడికొండలో హరిహరక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమెట్టురామలింగేశ్వరస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి క్షేత్రంలో మాస శివరాత్రి సందర్భంగా ఆదివారం శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు రాగిచేడు అభిలా్‌షశర్మ, స్వామి వారికి ప్రాతఃకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శైవాగమ పండితులచే పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో వీరస్వామి, ఆలయ సిబ్బంది రామక్రిష్ణారావు, భాస్కర్‌, రణధీర్‌, అనిల్‌, భక్తులు పాల్గొన్నారు. 


శ్రీవీరభద్రస్వామికి సర్వాంగ అభిషేక అలంకారం

భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండల కొత్తకొండ శ్రీవీరభద్రస్వామిని ఆదివారం సర్వాంగ అభిషేక అలం కారం నిర్వహించారు. మాసశివరాత్రి పురస్కరించుకొని స్వామివారిని అ లంకరణ చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం చేశారు. కార్తీక మాసం, మాసశివరాత్రి ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ఈవో రజినికుమారి ఆధ్వర్యంలో అర్చకుడు వీరభద్రయ్యశర్మ, రాజయ్య, రాంబాబు, సదయ్య భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.


భవానీ శంకరాలయంలో రుద్రహోమం..

శంభునిపేట : కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరంలోని రంగశాయిపేటలో గల చారిత్రక భవానీ శంకరాలయంలో ప్రత్యేక పూజను నిర్వహించారు. ఆలయ పూజారి శివప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం క్రతువును నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వేదమంత్రాలు, శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:30:56+05:30 IST