భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ఆదుకోండి: పొన్నం
ABN , First Publish Date - 2020-08-17T02:21:03+05:30 IST
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కోరారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు సీఎస్, డీజీపీ లకు ఆయన లేఖ రాశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణం వసతి, ఆహారం అందజేయాలన్నారు. వర్షాల వల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని, క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖను వెంటనే అప్రమత్తం చేయాలని కోరారు. ప్రతి జిల్లాకు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని పొన్నం కోరారు.