కోదురుపాకను అభివృద్ధి చేయరా..?: పొన్నం ప్రభాకర్

ABN , First Publish Date - 2020-12-19T17:37:25+05:30 IST

సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కోదురుపాకను అభివృద్ధి చేయరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

కోదురుపాకను అభివృద్ధి చేయరా..?: పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కోదురుపాకను అభివృద్ధి చేయరా అని టీపీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మిడ్ మానేరు ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను  ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. డిసెంబర్ 31లోగా  మిడ్ మానేరు  సమస్యలు పరిష్కరించాలని లేకపోతే జనవరిలో మరో పోరాటం తప్పదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ముంపు గ్రామాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లాకు నలుగురు మంత్రులు ఉండి జిల్లాను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలతో ప్రజలు విసిగి పోయారని అన్నారు.

Read more