వరిధాన్యంలో తాలు పేరుతో దోపిడీని నిరసిస్తూ పొన్నం దీక్ష

ABN , First Publish Date - 2020-04-28T16:48:05+05:30 IST

కరీంనగర్: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు.

వరిధాన్యంలో తాలు పేరుతో దోపిడీని నిరసిస్తూ పొన్నం దీక్ష

కరీంనగర్: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. వరిధాన్యంలో తాలు పేరుతో దోపిడిని నిరసిస్తూ పొన్నం ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాలు పేరుతో రైస్ మిల్లర్లు రైతులకి కోత విధిస్తూ నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. సివిల్ సప్లై మంత్రి సొంత జిల్లాలోనే రైతులు ఆందోళనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులని నష్టపరిస్తే సహించేది లేదన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పొన్నం డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-28T16:48:05+05:30 IST