4గురు మంత్రులకు రైస్ మిల్లర్లతో సత్సంబంధాలు: పొన్నం
ABN , First Publish Date - 2020-05-18T17:43:51+05:30 IST
కరీంనగర్: ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేయమని సీఎం చెప్పలేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

కరీంనగర్: ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేయమని సీఎం చెప్పలేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మిల్లర్లతో అన్ని గంటలు చర్చలు జరిపి ఏం లాభమని ప్రశ్నించారు. నలుగురు మంత్రులకు రైస్ మిల్లర్లతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రైతులకు అన్యాయం జరిగినా మంత్రులు, సీఎం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో వంద శాతం ధాన్యం సేకరణ జరిగితే.. కరీంనగర్‌లో సగం కూడా జరగలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.