దుబ్బాకలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ABN , First Publish Date - 2020-11-03T23:54:32+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా కలెక్టర్ భారతీహొళ్లికేరి అవకాశం కల్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారికంగా

దుబ్బాకలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా కలెక్టర్  భారతీహొళ్లికేరి అవకాశం కల్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారికంగా 81.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 89.85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



టీఆర్ఎస్‌ నుంచి సోలిపేట సుజాత పోటీ పడగా.. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేశారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Updated Date - 2020-11-03T23:54:32+05:30 IST