కాచిగూడ కళాశాలలో పోలీస్‌ శిక్షణ

ABN , First Publish Date - 2020-10-27T09:53:50+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు శుభవార్త. ఇంటర్‌ తర్వాత పోలీస్‌ ఉద్యోగం సాధించేలా.. నిపుణులతో అవగాహన కార్యక్రమాలతో

కాచిగూడ కళాశాలలో పోలీస్‌ శిక్షణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఉచితం

విద్యార్థినులకు నాంపల్లి కళాశాలలో.. 1 నుంచి ప్రారంభం


బర్కత్‌పుర, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు శుభవార్త. ఇంటర్‌ తర్వాత పోలీస్‌ ఉద్యోగం సాధించేలా.. నిపుణులతో అవగాహన కార్యక్రమాలతో పాటు శారీరక్ష శిక్షణను ఉచితంగా అందించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో బాలురకు కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను, బాలికలకు నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శిక్షణ కేంద్రాలుగా ఎంపిక చేసింది. వీటిలో నవంబరు 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హై జంప్‌, త్రో బాల్‌లో రెండుచోట్ల 100 మంది చొప్పున విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బసరతుల్లా షరీఫ్‌ తెలిపారు. వివరాలకు 9848012169 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-10-27T09:53:50+05:30 IST