బస్సులు, లారీలను నిలిపివేస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-03-23T15:04:15+05:30 IST

జహీరాబాద్‌లోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న..

బస్సులు, లారీలను నిలిపివేస్తున్న పోలీసులు

సంగారెడ్డి: జహీరాబాద్‌లోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న బైక్‌లు, బస్సులు, లారీలను పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టు దగ్గర హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నారు.

Updated Date - 2020-03-23T15:04:15+05:30 IST