అమృత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు

ABN , First Publish Date - 2020-03-08T17:21:44+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానస్పద స్థితిలో..

అమృత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు

నల్గొండ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


అయితే.. మారుతీరావు ఆత్మహత్యతో మిర్యాలగూడలోని అమృత ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదివరకే అమృత ఇంటికి జిల్లా ఎస్పీ సెక్యూరిటీ కల్పించిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో మరింత భద్రత పెంచారు. మారుతీరావు ఆత్మహత్యతో ఆయనకు సంబంధించిన అనుచరులు, బంధువులు.. అమృత ఇంటిపై దాడికి పాల్పడతారనే అనుమానంతో ముందస్తుగా భద్రత పెంచినట్లు తెలుస్తోంది.


కాగా.. ఇదివరకే మారుతీరావు ఆత్మహత్యపై ఇదివరకే అమృత స్పందించింది. ‘ప్రణయ్‌ను హత్య చేశానని మా నాన్న పశ్చాతాపం చెంది ఉంటాడు. నాన్న ఆత్మహత్యపై మాకు క్లారిటీ లేదు. అన్ని వివరాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది.

Updated Date - 2020-03-08T17:21:44+05:30 IST