రైతుపై దాడి.. ఎస్సైపై వేటు..

ABN , First Publish Date - 2020-08-12T00:55:04+05:30 IST

పోలీస్ స్టేషన్‌లో రైతుపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నాగారం ఎస్సై లింగం పై జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఎస్సై లింగం ని వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కరన్ ఉత్తర్వులు జారీ

రైతుపై దాడి.. ఎస్సైపై వేటు..

సూర్యాపేట : పోలీస్ స్టేషన్‌లో రైతుపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నాగారం ఎస్సై లింగం పై జిల్లా ఎస్పీ వేటు వేశారు.  ఎస్సై లింగం ని వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కరన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌లో ఎస్సై లింగం తనపై దాడి చేశాడంటూ ఓ రైతు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఎస్సై లింగం పై శాఖా పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో టాస్క్ ఫోర్స్ విభాగంలో ఉన్న ఎస్సై హరికృష్ణకు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2020-08-12T00:55:04+05:30 IST