ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2020-03-23T10:20:24+05:30 IST

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. ఆదివారం విధుల్లో ఉన్న

ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం

ఖమ్మం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం, మార్చి 22: జనతా కర్ఫ్యూ సందర్భంగా ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. ఆదివారం విధుల్లో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించారంటూ రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తమపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మొహియుద్దీన్‌ దుర్భాషలాడినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రవి, వీఆర్వో బాలయ్య ఆరోపించారు. ఈ మేరకు వీఆర్వోలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బంది తహసీల్దారు కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మమత రోడ్‌ సమీపంలో  విధుల్లోకి వస్తున్న కలెక్టరేట్‌ ఏవోను కూడా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఓ రోగిని తరలిస్తున్న 108 వాహనానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో అరగంట ఆలస్యంగా ఆస్పత్రికి వెళ్లింది. 

Updated Date - 2020-03-23T10:20:24+05:30 IST