వ్యాపారుల కోసం పోలీసుల హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2020-03-28T21:31:34+05:30 IST

కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కారణంగానే వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించడానికి నగర పోలీస్‌కమిషనర్‌ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు

వ్యాపారుల కోసం పోలీసుల హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌: కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కారణంగానే వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించడానికి నగర పోలీస్‌కమిషనర్‌ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. అందుకే రాష్ట్రంలోకి వచ్చేసరుకులు, కూరగాయల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీంతో ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా వ్యాపారులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనేపధ్యంలోనే వాహనాల రాకపోకలు, వారుఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోలీసుల సాయం కోసం హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాల మేరకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశారు. వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను 040-23434343 నెంబర్‌కు తెలియజేస్తే అవసరమైన సాయాన్ని చేస్తారు. 24 గంటలూ ఈ హెల్ప్‌లైన్‌పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. ఇందులో ప్రధానంగా వాహనాల ఇబ్బందులు, వ్యాపారంలో నిర్వహణలో ఇబ్బందులు, ఏదైనా సాయం కోసం వ్యాపారులు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అధికారులు కూడా జిల్లాల నుంచి వెళ్లే, ఇతర జిల్లాల నుంచివాహనాలనుసమన్వయం చేస్తారు. అలాగే లోడింగ్‌, అన్‌లోడింగ్‌తో పాటు ఆఖరు వ్యాపారికి సరుకుల చేరవేత వరకూ వస్తున్న ఇబ్బందలపై సంప్రదించ వచ్చని అన్నారు. 

Updated Date - 2020-03-28T21:31:34+05:30 IST