జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీస్ శాఖ సన్నద్ధం

ABN , First Publish Date - 2020-11-19T17:53:41+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్స్ సన్నాహాలు చేస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీస్ శాఖ సన్నద్ధం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్స్ సన్నాహాలు చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు 30 వేల మంది సిబ్బందితో పటిష్ట భద్రత కింది స్థాయి ఉద్యోగులతో అధికారులు సమావేశం కానున్నారు. సమస్యాత్మక ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. నేరచరితులను, రౌడీషీటర్స్‌ను పోలీసులు బైడోంవర్ చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్స్, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాదులో సభలు సమావేశాలు ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి చేశారు. ఎన్నికల ప్రచారానికి లౌడ్ స్పీకర్ల వినియోగం కోసం పోలీసుల అనుమతిని సైతం తప్పనిసరి చేశారు. పార్టీ ఆఫీసులు ఉన్న 100 మీటర్ల పరిధిలో మరో పార్టీ ఆఫీస్ నెలకొల్పడం నిషేధమన్నారు. నాయకులు తమ గన్స్‌ను సమీప పోలీస్ స్టేషన్లలో అందచేయాలని.. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-11-19T17:53:41+05:30 IST