హైదరాబాద్‌లో అటు ఆంక్షలు.. ఇటు పార్టీలు

ABN , First Publish Date - 2020-12-30T23:51:51+05:30 IST

నగరంలో కొత్త సంవత్సర వేడుకలకు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకూడదని వారం రోజులుగా..

హైదరాబాద్‌లో అటు ఆంక్షలు.. ఇటు పార్టీలు

హైదరాబాద్: నగరంలో కొత్త సంవత్సర వేడుకలకు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకూడదని వారం రోజులుగా క్లబ్‌లు, పబ్‌లతో పాటు హోటళ్ల నిర్వాహకులందరికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలో రోజు వారీ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాల సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అర్థరాత్రి 12 గంటల వరకూ దుకాణాలను తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే క్లబ్బులు, పబ్బులు కూడా ఒంటిగంట వరకూ తెరుచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పరోక్షంగా అవకాశం కల్పించినట్లైంది. 


దీంతో వివిధ ఈవెంట్ ఆర్గనైజర్లు మార్కెటింగ్ ప్రారంభించారు. నిజం చెప్పాలంటే అంతకుముందు నుంచే మార్కెటింగ్ ప్రారంభించారు. రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్ చేసి ఈవెంట్లు ఏర్పాటు చేస్తామని, హాజరుకావాలని పిలుపునిస్తున్నారు. రిఫరెన్స్ ఉంటేనే ఈవెంట్‌లోకి అనుమతి అంటూ కస్టమర్లకు వల విసురుతున్నారు. జంటగా వస్తే ఓ రేటు, సింగిల్‌ పర్సన్‌కు మరో రేటు పెడుతున్నారు. 


Updated Date - 2020-12-30T23:51:51+05:30 IST