పోలీస్ ఫ్లాగ్ డే ఫొటో, వ్యాస రచన పోటీల విజేతలు
ABN , First Publish Date - 2020-10-31T09:57:03+05:30 IST
పోలీస్ ఫ్లాగ్ డే (పోలీసు అమర వీరుల సంస్మరణ దినం) సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ, వ్యాసరచన పోటీల ఫలితాలను డీజీపీ కార్యాలయం

హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీస్ ఫ్లాగ్ డే (పోలీసు అమర వీరుల సంస్మరణ దినం) సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ, వ్యాసరచన పోటీల ఫలితాలను డీజీపీ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ‘విపత్కర పరిస్థితులు - సామాజిక సేవలో పోలీసులు’ అనే అంశంపై రాష్ట్రవ్యాప్త ఫొటోగ్రఫీ పోటీల్లో మొదటి బహుమతిని బి. సురేందర్ కుమార్, ద్వితీయ బహుమతిని హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్ ఆదుల కృష్ణ, తృతీయ బహుమతిని ఫొటో జర్నలిస్టు సతీష్ లాల్ అంధేకర్ గెలుచుకున్నారు. ‘కొవిడ్-19- విధుల్లో పోలీసులకు ఎదురైన సవాళ్లు’ అంశంపై సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పి.అరుణ కుమారి(సదాశివపేట), సి.హెచ్. కృష్ణ చైతన్య(ఏఆర్ పీసీ, ఆదిలాబాద్), కె.వెంకన్న(పీసీ, అన్నెపర్తి 12వ బెటాలియన్) వరసగా తొలి మూడు బహుమతులు సొంతం చేసుకున్నారు. ‘కొవిడ్-19 సందర్భంగా పోలీసింగ్‌లో సరికొత్త ఆవిష్కరణలు’ అంశంపై వ్యాస రచన పోటీల్లో ఎల్. మౌనిక(సైబర్ - ఐటీ సెల్, నల్లగొండ), పి.రాజు(ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్), జి.కార్తీక్(ఆర్‌ఐ, 5వ బెటాలియన్, పీటీసీ వరంగల్) వరసగా తొలి మూడు బహుమతులు గెలుచుకున్నారు.