ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-09-21T23:28:40+05:30 IST

ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గాలింపు చర్యలను ఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరంలో చిత్రీకరిస్తున్నారు.

ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్

కుమ్రం భీం: ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గాలింపు చర్యలను ఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరంలో చిత్రీకరిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మండలం కదంబా అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌తో జిల్లాలోని మారుమూల పోలీస్‌స్టేషన్‌లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్న తాధికారుల ఆదేశాలతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న కోట పల్లి, వేమనపల్లి మండలాలలో పోలీ సులు ముమ్మర కూంబింగ్‌ చేపట్టారు. కదంబా ఎన్‌కౌంటర్‌ జరిగిన కొన్ని గంటల్లోనే ప్రత్యేక పోలీసు బలగాలు అడవుల బాటపట్టాయు. ప్రత్యేక పోలీ సు బలగాలు  నాలుగు బృందాలుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అడవు లతోపాటు సరిహద్దు తీరం వెంట నిఘా పెంచారు. ప్రాణహిత, గోదావ రి నదుల తీరం పొడవునా పోలీసులు తనిఖీ చేపట్టారు.

Updated Date - 2020-09-21T23:28:40+05:30 IST