లాక్ డౌన్ పాటించకపోవడంపై పోలీసుల సీరియస్
ABN , First Publish Date - 2020-03-23T20:46:53+05:30 IST
నల్గొండ జిల్లాలో లాక్ డౌన్ పాటించకపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఏరియాల వారీగా ప్రధాన రోడ్లపై బారికేడ్ల ఏర్పాటు చేశారు. అనవసరంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

నల్గొండ: నల్గొండ జిల్లాలో లాక్ డౌన్ పాటించకపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఏరియాల వారీగా ప్రధాన రోడ్లపై బారికేడ్ల ఏర్పాటు చేశారు. అనవసరంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ప్రజలెవ్వరూ అనవసరంగా బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇష్టారీతిన రోడ్లపై సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలుపై సీఎస్, డీజీపీ అత్యవసర సమావేశం అయ్యారు. లాక్‌డౌన్ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు