పోలీసుల ఓవరాక్షన్‌.. ఆంధ్రజ్యోతి వాహనంపై దాడి

ABN , First Publish Date - 2020-03-26T02:28:34+05:30 IST

ఆదివారం లాక్‌డౌన్ సందర్భంగా రాత్రి పలువురు జర్నలిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ మరుసటి రోజు సీఎం స్పందన ఇది. అయితే అంతలోనే పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. మీడియా

పోలీసుల ఓవరాక్షన్‌.. ఆంధ్రజ్యోతి వాహనంపై దాడి

మహబూబాబాద్‌: ‘‘మీడియా సమాజం కోసం పని చేస్తుంది, ప్రభుత్వం కోసం పని చేస్తోంది. వారిని అడ్డుకోకండి’’ రెండు రోజుల క్రితం పోలీసులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలివి. ఆదివారం లాక్‌డౌన్ సందర్భంగా రాత్రి పలువురు జర్నలిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ మరుసటి రోజు సీఎం స్పందన ఇది. అయితే అంతలోనే పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. మీడియా వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్‌పై దాడి చేశారు. సీఎం ఆదేశాలను భేఖాతరు చేశారు. జిల్లాలోని తొర్రూరులో ఆంధ్రజ్యోతి పేపర్లు తరలించే వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మీడియా వాహనం అని చెప్పినా వినకుండా డ్రైవర్‌పై పోలీసులు దాడి చేశారు.

Read more