వాట్సాప్‌లో అసత్య ప్రచారం.. వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-04-05T08:25:17+05:30 IST
వాట్సాప్‌లో కరోనాపై అసత్య ప్రచారం చేసిన పి.వెంకటేశ్ అనే వ్యక్తిపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు శనివారం అరెస్టు...
కీసర రూరల్, పూడూరు, ఏప్రిల్ 4: వాట్సాప్‌లో కరోనాపై అసత్య ప్రచారం చేసిన పి.వెంకటేశ్ అనే వ్యక్తిపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన వెంకటే శ్ కరోనాకు సంబంధించి విధ్వేషాలు రెచ్చగొట్టే ఒక వీడియోని రాంపల్లి ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ చెప్పారు.