శభాష్.. పోలీస్..
ABN , First Publish Date - 2020-11-21T10:29:12+05:30 IST
ఓ పన్నెండేళ్ల బాలుడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోతుండగా బచ్చన్నపేట పోలీసు లు ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే చాకచక్యంగా పట్టుకున్నారు.

ఇంటి నుంచి పారిపోతున్న బాలుడిని చాకచక్యంగా పట్టుకున్న రక్షకభటులు
బచ్చన్నపేట, నవంబరు 20: ఓ పన్నెండేళ్ల బాలుడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోతుండగా బచ్చన్నపేట పోలీసు లు ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే చాకచక్యంగా పట్టుకున్నారు. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కోల పద్మ-శ్రీనివా్‌సల మూడో కుమారుడు వరుణ్ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లోని స్కూటీ, తండ్రి సెల్‌ఫోన్, రూ. 6 వేలు తీసుకుని మొదట హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి ఏటూరునాగారం మీదుగా చత్తీ్‌సగఢ్ వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కాడు. అయితే వీరు ములుగు దాటిన తర్వాత వెంటవచ్చిన బాలుడు వరుణ్‌కు తెలియకుండానే బస్‌దిగిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా గమనించిన వరుణ్ ఏటూరునాగారంలో బస్‌దిగి తిరిగి హన్మకొండకు వచ్చే బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బాలుడి తల్లిదండ్రులు బచ్చన్నపేట ఎస్సై లక్ష్మణ్‌రావుకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. ఫోన్‌నంబర్ లొకేషన్ ఆధారంగా అతడు ఉన్న బస్సును గుర్తించి, డిపో అధికారుల ద్వారా డ్రైవర్, కండక్టర్‌ల సెల్ నంబర్లు సేకరించి వారితో మాట్లాడి సినీ ఫక్కీలో బస్‌కు ఎదురుగా వెళ్లి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బచ్చన్నపేటకు తీసుకొచ్చి తల్లిండ్రులకు అప్పగించారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ అనిల్‌ను ఎస్సై అభినందించారు. వారికి సహకరించిన కోర్‌టీం సభ్యులు వెంకన్న, సల్మాన్, మాధవరావులను ప్రశంసించారు. కాగా ఫిర్యాదు చేసిన 5 గంటల్లోనే కేసును ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.