ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ప్రధాని మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2020-03-25T03:36:05+05:30 IST

ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. మంగళవారం ఉదయం కీలక పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆర్కే..

ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ప్రధాని మోదీ ఫోన్‌

హైదరాబాద్: ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. మంగళవారం ఉదయం కీలక పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆర్కే పాల్గొన్నారు. ఉదయం బిజీ షెడ్యూల్‌లో ఉండడం వల్ల మాట్లాడడం వీలుపడలేదని, కరోనాపై పోరాటం, 3 వారాల కర్ఫ్యూ విషయంలో సూచనలు చేయాలని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆర్కేను ప్రధాని మోదీ కోరారు. 3 వారాల కర్ఫ్యూ సమయంలో నిత్యావసర సరకుల సరఫరా ప్రధాన సమస్య అయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ దృష్టికి ఆర్కే తీసుకెళ్లారు. ఆ సమస్యలు పరిష్కరించగలిగితే కరోనాపై పోరాటం తప్పక విజయవంతం అవుతాయని ఆయన చెప్పారు. నిత్యావసర సరకుల సరఫరా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మోదీకి సూచించారు. నిత్యావసర సరకుల ధరలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ సూచనకు ప్రధాని మోదీ.. వందశాతం ఏకీభవించారు. నిత్యావసరాల విషయంలో కొన్ని రాష్ట్రాలకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ప్రధాని మోదీ. 

Updated Date - 2020-03-25T03:36:05+05:30 IST