రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-01T08:38:32+05:30 IST
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 20వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబరు 2 నుంచి 8 వరకు సీపీఐ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించనుంది

హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 20వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబరు 2 నుంచి 8 వరకు సీపీఐ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో మావోయిస్టులకు అనుకూలమైన జిల్లాలతోపాటు రాష్ట్ర సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా పార్టీని బలోపేతం చేయడానికి కొత్త నియామకాలతోపాటు ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది.