వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ

ABN , First Publish Date - 2020-09-29T07:55:02+05:30 IST

ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎ్‌ససీసీ) పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన భగత్‌సింగ్‌ 114వ జయంతి సభలో రైతు, వ్యవసాయ కార్మిక

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ

హైదరాబాద్‌,  సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎ్‌ససీసీ) పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన భగత్‌సింగ్‌ 114వ జయంతి సభలో  రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పలువురు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీ య కార్యదర్శి బి.వెంకట్‌, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యం.సాయిబాబా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T07:55:02+05:30 IST