శంషాబాద్‌లో పైలట్‌ శిక్షణ కేంద్రం

ABN , First Publish Date - 2020-03-13T09:01:21+05:30 IST

పైలెట్ల శిక్షణకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత అనువైన ప్రదేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం విమానాశ్రయంలో పైలట్లకు శిక్షణను

శంషాబాద్‌లో పైలట్‌ శిక్షణ కేంద్రం

గురువారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పైలెట్ల శిక్షణకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత అనువైన ప్రదేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం విమానాశ్రయంలో పైలట్లకు శిక్షణను అందించే ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ను(ఎ్‌ఫఎ్‌సటీసీ) ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం విమానయాన రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమేనన్నారు. ఎఫ్‌ఎ్‌సటీసీతో హైదరాబాద్‌లో శిక్షణ కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయన్నారు. గురుగ్రామ్‌లో కూడా తమ శిక్షణ కేంద్రం ఉందని ఎఫ్‌ఎ్‌సటీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ పైలెట్‌తో పాటు విమానం కాక్‌పిట్‌లో కూర్చుని కాసేపు విహరించారు. అనంతరం నగరంలో జరిగిన మరో కార్యక్రమంలో కేటీఆర్‌ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కలిసి నోవా ఇంటగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2020-03-13T09:01:21+05:30 IST