కేంద్రీకృత సమాచారంతోనే కరోనాపై వదంతులకు చెక్‌ : పీఐబీ

ABN , First Publish Date - 2020-06-21T09:50:50+05:30 IST

ప్రభుత్వం నుంచి వెలువడే కేంద్రీకృత సమాచారంతోనే కరోనా వ్యాప్తిపై వదంతులు, పుకార్లకు చెక్‌ పెట్టొచ్చని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) సౌత్‌

కేంద్రీకృత సమాచారంతోనే కరోనాపై వదంతులకు చెక్‌ : పీఐబీ

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి వెలువడే కేంద్రీకృత సమాచారంతోనే కరోనా వ్యాప్తిపై వదంతులు, పుకార్లకు చెక్‌ పెట్టొచ్చని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) సౌత్‌ జోన్‌ డీజీ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కోవాలంటే ప్రభావశీల సమాచారమే కీలకమని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విభాగం, యూనిసె్‌ఫలతో కలిసి పీఐబీ శనివారం ‘బిహేవియరల్‌ చేంజ్‌ కమ్యూనికేషన్‌’ అనే అంశంపై తన కార్యాలయం నుంచి వెబినార్‌ను నిర్వహించింది. ఇందులో ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్‌ కె.స్టీవెన్సన్‌, జర్నలిజం ప్రొఫెసర్‌ బాలస్వామి, కమ్యూనికేషన్‌ డెవల్‌పమెంట్‌ స్పెషలిస్ట్‌ సీమ కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T09:50:50+05:30 IST