విధుల్లోకి తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన పీడీలు
ABN , First Publish Date - 2020-12-16T04:33:59+05:30 IST
విధుల్లోకి తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన పీడీలు
మహబూబాబాద్ టౌన్, డిసెంబరు 15: తమను విధుల్లోకి తీసుకోవాలని మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఫిజికల్ డైరెక్టర్లు జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారులు వారికి నచ్చజెప్పి కిందకు దించారు. మహబూబాబాద్ జిల్లాలో జి. వీరన్న, టి. సురే్‌షకుమార్, ఎన్. గోవర్ధన్, పి.నరేందర్, కె.అరుణ్‌లు మోడల్ స్కూళ్లలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫిజికల్ డైరెక్టర్లుగా పని చేశారు. జనవరి 2019లో ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో మోడల్‌స్కూళ్లలో పీడీలుగా చేరారు. అయితే సదరు ఏజెన్సీని రద్దు చేసి వీరిని ఈనెల 14న విధుల్లో నుంచి తొలగించారు. ఈక్రమంలో తమను విఽధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగా రు. ఇందులో వీరన్న తన వెంట పెట్రోల్ బాటిల్‌ను తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం అక్కడకు చేరుకుని జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం డీఎస్పీ ఆంగోతు నరే్‌షకుమార్ ట్యాంక్ వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని వారికి నచ్చ చెప్పడంతో కింది దిగారు. దీంతో గంట సేపు ఉత్కంఠతకు తెరపిడింది.