ఆరోగ్య కేంద్రాల్లో వారికి చికిత్స : డీఎంహెచ్‌వో
ABN , First Publish Date - 2020-12-20T04:37:21+05:30 IST
ఆరోగ్య కేంద్రాల్లో వారికి చికిత్స : డీఎంహెచ్‌వో

వరంగల్ రూరల్ కల్చరల్, డిసెంబరు 19: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కుష్ఠువ్యాధికి చికిత్స అందిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. శనివారం రూరల్ జిల్లా కార్యాలయంలో ఆశా నోడ ల్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, శ్రీదేవి, దేవిక, పారా మెడికల్ అధికారులు రాజు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ఆరోగ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆశా కార్యకర్తలు, సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు.
రాయపర్తి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో మధుసూదన్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యాధికారి వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.