సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌కు సహకరించని ఫార్మ కంపెనీలు

ABN , First Publish Date - 2020-03-23T14:25:59+05:30 IST

జిల్లాలో లాక్ డౌన్‌కు ఫార్మ కంపెనీలు సహకరించడంలేదు.

సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌కు సహకరించని ఫార్మ కంపెనీలు

సంగారెడ్డి: జిల్లాలో లాక్ డౌన్‌కు ఫార్మ కంపెనీలు సహకరించడంలేదు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో కూడా పరిశ్రమలు తెరిచారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు పరిశ్రమల యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.  కరోనా వైరస్ స్థానికులకు వ్యాపించకుండా నిలువరించడం కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో మరో తొమ్మిది రోజులు అందరూ ఇంట్లో ఉండాల్సిందే. కరోనాపై సమరంలో విజయం సాధించడానికి స్వీయ నిర్బంధం తప్పనిసరని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం పాటించిన బంద్‌ మరో 9 రోజులు కొనసాగుతుందని తెలిపారు.

Updated Date - 2020-03-23T14:25:59+05:30 IST