రుణం ఇస్తాం.. బాకీలు కట్టుకోండి
ABN , First Publish Date - 2020-04-21T09:37:52+05:30 IST
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పెద్ద మొత్తంలో బకాయి పడ్డ డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్ ఇచ్చింది.

డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్
ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాలనే షరతు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పెద్ద మొత్తంలో బకాయి పడ్డ డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్ ఇచ్చింది. బకాయిలను తీర్చడానికి డిస్కమ్‌లకు రుణం ఇవ్వాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్‌ఫసీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లు రూ.88 వేల కోట్ల దాకా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బాకీ ఉన్నాయి. అయితే వాటి లో రూ.13 వేల కోట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. వీటిని ఏకకాలంలో తీర్చడానికి రుణం ఇస్తామని పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ సోమవారం ఆఫర్ ఇచ్చాయి. అయితే రుణం తీసుకోవాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూ చీకత్తు(గ్యారంటీ) ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం షరతు పెట్టింది. ఇక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రెండేళ్లపా టు మారిటోరియం ఆఫర్ కూడా ఇచ్చిం ది. తీసుకునే రుణం ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపులకు లోబడిఉంటుందని గుర్తు చే సింది.
రుణాన్ని తిరిగి 10-15 ఏళ్లలోపు చెల్లించడానికివెసులుబాటు కూడా ఇవ్వనుంది. వాస్తవానికి ఇప్పటికే రూ.5500 కోట్లను బ్లాండ్లు/రుణం రూపంలో సేకరించడానికి ప్రభుత్వం సూత్రప్రాయం గా ట్రాన్స్‌కోకు ఆమోదం తెలిపింది. అయితే కరోనా సంక్షోభంతో ఉత్తర్వులు వెలువడలేదు.తాజాగా ఆర్‌ఈసీ/పీఎ్‌ఫసీ ఆఫర్‌కు రాష్ట్రప్రభుత్వం ఆమో దం తెలుపుతుందో, లేదో తేలాల్సి ఉంది. రెండేళ్లుగా తెలంగాణ ట్రాన్స్‌కో (డిస్కమ్)లు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. 24 గంటల కరెంటు అందించడానికి ఆపసోపాలు పడి, అప్పులు చేసి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా గతేడాది ఆగస్టు 1 నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌సీ) అమలుతో ఏ వారానికి సరిపడా కరెంట్‌కు ఆ వారం డబ్బులు కడుతూ ట్రాన్స్‌కో ముందుకెళుతోంది. దాంతో పాత బకాయిలు రూ.13 వేల కోట్ల దాకా అలాగే పేరుకుపోయాయి.
గుట్టలా బకాయిలు..
దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా ఎన్‌టీపీసీతోపాటు సింగరేణి, ట్రాన్స్‌కో, ఛత్తీ్‌సగఢ్, సోలార్ డెవలపర్లకు బకాయి ఉండటం, ఆ బకాయిలు గుట్టల్లా పేరుకుపోవడంతో ఆయా సంస్థల ఒత్తిళ్లతో ట్రాన్స్‌కో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక అరడజనుసార్లకు పైగా బకాయిలు కట్టకపోతే కరెంట్ సరఫ రా నిలిపివేస్తామని ఎన్‌టీపీసీ హెచ్చరిక లు చేయడం, ఆ తర్వాత ఎలాగోలా నచ్చజెప్పి ముందుకెళ్లడం జరిగింది. తాజాగా ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ ఆఫర్‌తో ట్రాన్స్‌కోలో కొ త్త ఆశలు రేకెత్తుతున్నాయి. రూ.13 వేల కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతుందా? లేక ఇదివరకే ప్రాథమిక ఆమోదం తెలిపిన రూ.5500 కోట్లకే మొగ్గుచూపుతుందా అన్నది తేలాల్సి ఉంది.
పెరిగిన అంతరం..
ప్రస్తుతం ఆదాయానికి, అవసరాల కు మధ్య అంతరం అనూహ్యంగా యూనిట్‌కు 0.27పైసలుగా ఉంది. అదే ఎస్పీడీసీఎల్(హైదరాబాద్) పరిధిలో యూనిట్‌కు అంతరం 0.47 పైసలు ఉండగా, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 0.19లుగా ఉంది. తాజాగా విద్యుత్ చార్జీలు పెం చుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో డిస్కమ్‌లు ఊపిరి పీల్చుకున్నాయి. ఇంతలో కరోనా విరుచుకుపడటంతో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. తాజా ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ ఆఫర్‌పై ప్రభుత్వ స్పందనపై ఉత్కంఠ నెలకొంది.