వ్యక్తిగత పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-03-25T08:59:18+05:30 IST
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, తమ ఇళ్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్

ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, తమ ఇళ్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతిభవన్‌కు వచ్చే వాళ్లందరూ చేతులు శుభ్రం చేసుకునేందుకు అక్కడి సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు, రెండు పెద్ద గంగాళాల్లో నీటిని ఏర్పాటు చేశారు. చేతులు శుభ్రం చేసుకున్నాకే ప్రగతిభవన్‌లోనికి రావాలని నిబంధన విధించారు. మంగళవారం సీఎం అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులు చేతులు కడుక్కునే లోపలికి వెళ్లారు.