హన్మకొండ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వ్యక్తి హత్య
ABN , First Publish Date - 2020-09-03T15:11:51+05:30 IST
వరంగల్ అర్బన్: హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఒకరి హత్య జరగగా,

వరంగల్ అర్బన్: హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఒకరి హత్య జరగగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో దొరమ్ శారద అనే కూరగాయలు విక్రయించే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆమె కుమారుడు అఖిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్, క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు కారణం ఏమై ఉంటుందా అని ఇరుగు, పొరుగు వారిని పోలీసులు విచారిస్తున్నారు.