నాగర్‌కర్నూల్ జిల్లా: పెద్దకొత్తపల్లిలో దారుణం

ABN , First Publish Date - 2020-07-10T20:19:37+05:30 IST

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది.

నాగర్‌కర్నూల్ జిల్లా: పెద్దకొత్తపల్లిలో దారుణం

నాగర్‌కర్నూల్ జిల్లా: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. అనాధ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో తీసుకువచ్చి వర్షంలోనే వదిలి వెళ్లిపోయారు. ఆ వృద్ధురాలు రాత్రి నుంచి వర్షంలోనే తడుస్తూ, చలికి వణుకుతూ కదలలేని స్థితిలో ఉండిపోయింది. కరోనా ప్రభావం కారణంగా గ్రామస్తులు వృద్ధురాలివద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఆకలితో అలమటిస్తూ వృద్ధురాలు పడుతున్నబాధ చూసేవారికి కళ్లల్లో నీళ్లు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మాటలు సరిగ్గా రాక.. కదలలేని స్థితిలో ప్లాస్టిక్ కవర్ ఆధారంగా చేసుకుని కాపాడండి అంటూ వేడుకుంటోంది.

Updated Date - 2020-07-10T20:19:37+05:30 IST