కరోనా పరీక్షల్లో అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-08T23:10:23+05:30 IST

కరోనా పరీక్షల విషయంలో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా పరీక్షల్లో అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

హైదరాబాద్: కరోనా పరీక్షల విషయంలో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టింగ్ సెంటర్లవద్ద రోజులు తరబడి తిరుగుతున్నా ఫలితం ఉండడంలేదని అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత వెంటాడుతోంది. గత పది రోజులుగా నగరంలో ఫీవర్ ఆస్పత్రి, నేచర్ క్యూర్, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రి.. ఇలా నగరంలో ఉన్న టెస్టింగ్ సెంటర్లు ఉన్న ప్రతి చోట గంటల కొద్ది బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలంది. ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో అయితే గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు వందమందికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో బాధితులు ప్రతి రోజు తెల్లవారు జాము 5 గంటలకు వచ్చి టోకెన్ తీసుకుని ఉంటున్నారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2020-07-08T23:10:23+05:30 IST