పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-10-28T10:23:36+05:30 IST

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న హాస్టల్‌ సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి డిమాండ్‌ చేశారు

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, అక్టోబరు 27: వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న హాస్టల్‌ సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హన్మకొండలోని రూరల్‌ డీఈవో కార్యాలయం ఎదుట మంగళవారం సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... మోడల్‌ స్కూళ్లలోని సిబ్బందికి లాక్‌డౌన్‌ నుంచి వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సిబ్బందికి వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ సిబ్బంది యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు అరుణ, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధానకార్యదర్శి మంజుల, సహాయకార్యదర్శి విజయ, కోశాధికారి స్రవంతి, సాంబలక్ష్మి, రజిత, సునీత, లావణ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T10:23:36+05:30 IST