తహసీల్దార్లకు చేరని పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-11-26T08:18:24+05:30 IST

పెండింగ్‌ మ్యుటేషన్లను పూర్తి చేయాలని ‘ధరణి’ వెబ్‌సైట్‌లో పెట్టుకున్న దరఖాస్తులు తహసీల్దార్లకు చేరడంలేదు. ఈనెల

తహసీల్దార్లకు చేరని పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులు

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ మ్యుటేషన్లను పూర్తి చేయాలని ‘ధరణి’ వెబ్‌సైట్‌లో పెట్టుకున్న దరఖాస్తులు తహసీల్దార్లకు చేరడంలేదు. ఈనెల 10 నుంచి ధరణి వెబ్‌సైట్‌లో పెండింగ్‌ మ్యుటేషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. అయితే గత సెప్టెంబరు 7కు ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరిగినప్పటికీ మ్యుటేషన్లు కాలేదు.


2 లక్షలకు పైగా వ్యవసాయ భూముల లావాదేవీలు రికార్డుల్లో చేరలేదు. దాంతో ఇదే అదనుగా ఆ భూములను మళ్లీ విక్రయించే దందా ఊపందుకోవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో అధికారులు పెండింగ్‌ మ్యుటేషన్లకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. స్లాట్‌ బుకింగ్‌ క్రమంలో పెండింగ్‌ మ్యుటేషన్ల దరఖాస్తు మాత్రమే వెబ్‌సైట్‌లోకి చేరుతోంది. 

Updated Date - 2020-11-26T08:18:24+05:30 IST