రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-09-12T18:37:41+05:30 IST

జిల్లాలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ పనులను పరిశీలించడానికి రామగుండం చేరుకున్న కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ లక్ష్మణ్ బాయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీ గేటు ఎదుట భారీగా నినాదాలు చేశారు. దీంతో ఎరువుల ఫ్యాక్టరీ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతుకు ముందు టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. 

Updated Date - 2020-09-12T18:37:41+05:30 IST