దుబ్బాక దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పదు

ABN , First Publish Date - 2020-10-27T09:08:28+05:30 IST

: మొక్కజొన్నను కొనుగోలు చేయనని ససేమిరా అన్న సీఎం కేసీఆర్‌ దుబ్బాక దెబ్బకు దిగివచ్చి గిట్టుబాటు ధరను ప్రకటించారని, ఇది ఈ నియోజకవర్గ ప్రజల విజయమేనని పీసీసీ

దుబ్బాక దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పదు

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకే తాను ముక్కలు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి



దుబ్బాక, అక్టోబరు 26: మొక్కజొన్నను కొనుగోలు చేయనని ససేమిరా అన్న సీఎం కేసీఆర్‌ దుబ్బాక దెబ్బకు దిగివచ్చి గిట్టుబాటు ధరను ప్రకటించారని,  ఇది ఈ నియోజకవర్గ ప్రజల విజయమేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.  ఈ ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎ్‌సలను ఓడిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయని, మద్దతు ధర, పంటనష్టం సాధించుకోగలుగుతామని  అన్నారు.  దుబ్బాక మునిసిపల్‌ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతులు పండించిన పంటకు బీమాలేదని, దీనివల్ల పంట నష్టానికి పరిహారం రాకుండా పోయిందన్నారు. 


సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగా సన్నరకం ధాన్యాన్ని పండించినందున దిగుబడి ఎకరాకు 30 నుంచి 20 క్వింటాళ్లకు తగ్గిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2500  గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు. పంటనష్టం పరిహారం ఎకరాకు రూ.20 వేలు అందించాలని డిమాండ్‌ చేశారు.  నిరుద్యోగ సమస్యతోపాటు ఇచ్చిన హామీలను మెడలు వంచి నెరవేర్చుకోవాలంటే దుబ్బాక ప్రజల తీర్పులోనే ఉందన్నారు. ఆయన వెంట సీనియర్‌ నాయకులు మల్లు రవి, నగేష్‌ ముదిరాజ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-10-27T09:08:28+05:30 IST