రఘునందన్‌రావు గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడు: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-11-01T03:11:06+05:30 IST
రఘునందన్, హరీశ్‌రావు ఇద్దరు అన్నదమ్ములని, బీజేపీకి ఓటేస్తే వృథా అవుతుందని ఆయన తెలిపారు. దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల ...

దుబ్బాక: బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకలో గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడని పీసీసీ చీఫ్ ఉత్తమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్, హరీశ్‌రావు ఇద్దరు అన్నదమ్ములని, బీజేపీకి ఓటేస్తే వృథా అవుతుందని ఆయన తెలిపారు. దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ మాటలు నమ్మి దుబ్బాక ప్రజలు చాలాసార్లు మోసపోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.