పే పాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు..

ABN , First Publish Date - 2020-12-30T14:13:23+05:30 IST

హైదరాబాద్: ఆధార్ నంబర్, వేలి ముద్రల ఫోటో కొత్త రకం మోసం ఒకటి తాజాగా వెలుగు చూసింది.

పే పాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు..

హైదరాబాద్: ఆధార్ నంబర్, వేలి ముద్రల ఫోటో కొత్త రకం మోసం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసి.. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంకు అకౌంట్ నుంచి పే పాయింట్ అకౌంట్ ద్వారా నిందితులు నగదు డ్రా చేశారు. తనకు తెలియకుండా తన ఖాతాలో నుంచి రూ10000 కాజేశారని మధురా నగర్ కాలనీకి చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నిందితులు విశాల్, అర్షద్ అనే సీఏ విద్యార్థులుగా గుర్తించారు. కేవలం ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటో.. నీటి చుక్కల సాయంతో పే పాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్టు నిందితులు వెల్లడించారు.

Updated Date - 2020-12-30T14:13:23+05:30 IST