విద్యావాలంటీర్లకు వేతనాలివ్వండి
ABN , First Publish Date - 2020-12-15T08:42:32+05:30 IST
గత విద్యా సంవత్సరంలో విధులు నిర్వర్తించిన విద్యావాలంటీర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.

హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత విద్యా సంవత్సరంలో విధులు నిర్వర్తించిన విద్యావాలంటీర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు విద్యావాలంటీర్లకు నాలుగు నెలల జీతాన్ని చెల్లించలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.