ఏనుగల్లులో గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-14T04:29:36+05:30 IST

ఏనుగల్లులో ఎనిమిది కిలోల ఎండు గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌బాబు ఆదివారం తెలిపారు.

ఏనుగల్లులో గంజాయి స్వాధీనం
పట్టుకున్న గంజాయిని చూపుతున్న పోలీసులు

ఏనుగల్లులో గంజాయి స్వాధీనం

పర్వతగిరి, డిసెంబరు 13: ఏనుగల్లులో ఎనిమిది కిలోల ఎండు గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌బాబు ఆదివారం తెలిపారు. ఏనుగల్లు శివారు పెద్దచెరువు పక్కన పెద్దమ్మగుడి వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు దాడులు చేశామన్నారు. దీంతో విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన అలమండ శేఖర్‌, ఏనుగల్లుకు చెందిన మొద్దు సతీష్‌ గంజాయితో పట్టుబడ్డారని తెలిపారు. 


Updated Date - 2020-12-14T04:29:36+05:30 IST