దొంగను పట్టించిన సీసీ కెమెరా
ABN , First Publish Date - 2020-12-14T04:24:02+05:30 IST
వెండి నగల దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పరకాల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

దొంగను పట్టించిన సీసీ కెమెరా
పరకాల, డిసెంబరు 13: వెండి నగల దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పరకాల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రేగొండ మండలానికి చెందిన యాట రాములు జల్సాలకు అలవాటుపడి 11న పరకాల కూరగాయల మార్కెట్ ప్రాంతంలోని ఉపేంద్రచారి నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50వేల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.