పరేషన్.. తెలంగాణ
ABN , First Publish Date - 2020-04-05T16:58:51+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి 12 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు రూ. 15వందలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బయట బియ్యం కొనలేని పేదలంతా రేషన్ బియ్యం కోసం దుకాణాలవద్ద క్యూ కట్టారు. బయోమేట్రిక్ విధానాన్ని రేషన్ షాపులలో ప్రభుత్వం అమలు చేస్తోంది. వినియోగదారులు మిషన్‌పై వేలిముద్ర వేయాలి. లేదంటే బియ్యం ఇవ్వరు.
కొన్ని జిల్లాల్లో రేషన్ షాపు దుకాణాల్లోని బయోమేట్రిక్ మిషన్లు మొరాయిస్తున్నాయి. సర్వర్ బిజీగా ఉండడంతో అటు డీలర్లు, ఇటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో లబ్దిదారులు షాపులవద్దకు రావడం, సర్వర్ పనిచేయకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లడం సాధారణంగా జరుగుతోంది. దీంతో లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వేలిముద్రలు లేకుండా రేషన్ ఇవ్వాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు.